Wednesday, September 9, 2020

"అంతా గురువు అనుగ్రహం" - (By విజయ గారు (ఖండవల్లి))

నాన్నగారిని మొదటిసారి ఆగర్రులో చూశాను. నన్ను చూసి నాన్నగారు మీది ఏ ఊరుమ్మా అని అడిగారు. మాది ఖండవిల్లి నాన్నగారు అని చెప్పాను. ఖండవిల్లి అని చెప్పగానే నాన్నగారి ముఖం చాలా ఆనందంతో వెలిగిపోయింది.

"విజయ మేము చిన్నప్పుడు ఖండవిల్లి వచ్చి ఆడుకునే వాళ్ళం అని చెప్పి, నిన్ను నేను గుర్తుపెట్టుకుంటాను. మిమ్మల్ని మర్చిపోపోము అమ్మ" అని అన్నారు.

నాన్నగారు నాకు మొదట అంతఃకరణం గురించి చెప్పారు. 

"అంతఃకరణం అంటే మనసు హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తుంది అని చెప్పి, మీరందరూ గుడిలో శివుడిని చూస్తున్నారుకదమ్మా మీరందరూ గుడిలో శివుడిని ఎలా అయితే చూస్తున్నారో , మీ హృదయంలో ఉన్న శివుడిని కూడా చూడాలమ్మ" అన్నారు.

"విజయ సత్సంగంలో ఏమి చదువుతున్నారు" అని అడిగారు.
"భాషణలు చదువుతున్నాము నాన్నగారు", అని చెప్పాను. 
"భాషణలు చదువుతున్నారమ్మా, అసలు నీకు అర్థం అవుతుందా?" అని అడిగారు.
"కొన్ని,కొన్ని అర్థమవుతున్నాయి చెప్పగలుగుతున్నాను నాన్నగారు. కొన్ని అర్థం అవుతున్నాయి కానీ వారందరికీ ఎలా చెప్పాలో నాకు అర్ధం కావట్లేదు నాన్నగారు" అని చెప్పాను.

"నాన్నగారు అలాగమ్మా అని కొన్నికొన్ని చెప్పగలుగుతున్నావమ్మా నీకు మాటలు అందటం లేదమ్మ, భగవాన్ చూస్తాడు లేమ్మ." అన్నారు నాన్నగారు.

నాన్నగారు అరుణాచలం వెళ్తే, నేను కూడా నాన్నగారితో వెళ్ళాను. నాన్నగారు మరియు ఇతర భక్తులందరూ హాల్లో కూర్చుని ఉన్నారు.

"భగవాన్ దర్శనం చేసుకున్నావా! విజయ" అని అడిగారు నాన్నగారు. ఇంతలో ఎవరో భక్తులు నాన్నగారి దగ్గరకు వచ్చి పండ్లు, వంద రూపాయలు ఇచ్చారు. 

"విజయ ఇలా రా, అని నన్ను పిలిచి తీసుకొమ్మా" అన్నారు. 
"నాకు డబ్బులు వద్దు నాన్నగారు", అన్నాను.

దానికి నాన్నగారు, "ఇది ప్రసాదం తీసుకోమ్మా అని చేతిలో పెట్టేసారు. పండ్లు మీద చేయి వేసి, ఇది పండ్లు ప్రసాదం అన్నారు. ధనం మీద చేయి వేసి, ఇది ధన ప్రసాదం అన్నారు. ఎవరైనా ప్రసాదం ఇస్తే వద్దంటారమ్మా ఇవి పట్టుకుని వెళ్ళు" అన్నారు.

నాన్నగారి దయవల్ల అప్పటినుండి, ఇప్పటివరకు ఏ లోటూ లేదు. ఇప్పటికీ ఆ వంద రూపాయలు నాన్నగారి గుర్తుగా అలాగే దాచుకున్నాను.

No comments:

Post a Comment