ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః
గురుదేవులు నాన్నగారి అద్భుతమైన ప్రేమకి "శ్రీ నాన్న హృదయం ట్రస్ట్" చిహ్నంగా నిలుస్తుంది. ఆయన ఆశయాలకు అనుగుణంగా, ఆయన మనపట్ల చూపించిన అపరిమితమైన ప్రేమకి చిహ్నంగా "శ్రీ నాన్న హృదయం ట్రస్ట్" నిర్మించబడింది.
ఆయన ద్వారా ప్రవహించిన అనుగ్రహంతో మన హృదయాలు నింపబడ్డాయి. ఆయన చూపించిన హద్దులు లేని ప్రేమ, ఆప్యాయత, కరుణకి అందరం పాత్రులమయ్యాము. ఆయన చూపించిన ఆధ్యాత్మిక మార్గంలో మన జీవితాలు కొనసాగుతున్నాయి. నాన్నగారు వేలాదిమంది జీవితాలకు నిరంతరం ఆధ్యాత్మిక బోధను అందించడమే కాకుండా, వారికి అన్ని విధాలుగా చేయూతనిచ్చి ఏ అవసరం వస్తే ఆ అవసరాన్ని నెరవేరుస్తూ వచ్చారు.
ఆయన ప్రేమతో దయా పూర్వకంగా చేసిన సామాజిక, ఆధ్యాత్మిక సేవలు మరియు అన్ని విధాలుగా మనకందించిన సహకారం స్ఫూర్తిదాయకమైనవి. "శ్రీ నాన్న హృదయం" అనే ట్రస్ట్ ఆయన పట్ల పూజ్య భావంతోను, మరియు ఆయన గౌరవార్థం నిర్మించబడింది. నాన్నగారు మానవాళికి అందించిన సేవలు ఈ ట్రస్ట్ ద్వారా కొనసాగుతాయి. ట్రస్ట్ కి వచ్చిన విరాళాలు పేదవారి అవసరాల కోసం వినియోగించబడతాయి. వారికి భోజనము, విద్య, వైద్యము మరియు వయో వృద్ధులకు వైద్య సేవలు అందించబడతాయి.
ఆయన అనుగ్రహంతో మేము చేసే ఈ చిన్న ప్రయత్నం సంఘంలో ఒక ఆధ్యాత్మిక, మానవతా దృక్పదాన్ని తీసుకొస్తుందని ... నిరుపేదల జీవితాలకు అవసరమైన సహకారం అందుతుందని ... ఈ విధంగా అర్థవంతంగా మన జీవితాలను మలుచుకోగలమని ఆశిస్తూ
కమిటీ సభ్యులు
Aum Sri Nanna Paramatmane Namaha

Srinannagaru quietly touched the lives of countless individuals not only with his teachings but also by extending his helping hand to those in need. His love continues to inspire acts of kindness, support, and service.
Nanna Hridayam, the trust created in his honour, serves as a platform to continue the compassionate work of Nannagaru. The funds we collect are used diligently and shared across various initiatives and projects like feeding the poor, granting educational scholarships, providing timely medical assistance, and helping the elderly in society. Through our efforts, we want to positively impact and bring about meaningful change in the lives of those in need.
Committee Members
No comments:
Post a Comment