Tuesday, December 15, 2020

"నాన్నగారి బ్లెస్ అండ్ బ్లిస్ " - (డాక్టర్ పెనుమత్స కృష్ణం రాజు గారు)

Early nineties లో ఒకసారి మీనాక్షి గారి ఇంటి మేడ మీద అంటే సీతంపేట, విశాఖపట్నంలో అరుణాచల దీపోత్సవం జరిగింది. దానికి నా భార్య, మా వదిన గారు మరియు ఇంకొందరు ఆ కార్యక్రమానికి తీసుకుని వెళ్ళమని కోరారు. నేను అటువంటి కార్యక్రమానికి రాను అని చెప్పాను. మా పిల్లలు చిన్న వాళ్లు కావడంతో వారిని చూసుకోవడానికి తప్పనిసరై నేను కూడా వెళ్ళవలసి వచ్చింది. మేము కొంచెం తొందరగా వెళ్ళాము. కార్యక్రమం మేడమీద కావడం వల్ల నేను మా అబ్బాయిని ఒడిలో కూర్చోబెట్టుకుని మేడ మీద పిట్టగోడ కు చేరబడి కూర్చున్నాను. కొంతసేపటికి నాన్నగారు వస్తున్నారని జనం పైకి వచ్చారు. నేను కదలకుండా అలాగే కూర్చుని మెట్ల మీద నుండి పైకి వచ్చే వారిని చూస్తున్నాను. సరిగా నాన్నగారు పై మెట్టు ఎక్కుతూ ఎదురుగా కూర్చుని ఉన్ననన్ను తీక్షణంగా చూశారు. “లవ్ ఎట్ ఫస్ట్ సైట్” నేను ముఖం చాటేశాను. “అవుట్ ఆఫ్ ఫియర్” లేక ‘అవుట్ అఫ్ లవ్” అది నాకు అర్థం కాలేదు. కార్యక్రమం మొదలైంది. వారు రమణ తత్వం గురించి కొన్ని మాటలు చెప్పినట్టు గుర్తు. వారు చెప్పేది పురాణ కాలక్షేపంలా లేదు అని అర్థం అయ్యింది. కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. కార్యక్రమంలో భాగంగా జ్యోతి వెలిగించారు. అందరూ గిరి ప్రదక్షిణ చేశారు. నేను కూడా పిల్లలను తీసుకొని ప్రదక్షిణలు చేశాను. నాన్న గారి మాటలు ఏదో కొత్త విషయం లా అనిపించింది. వారికి నమస్కరించి ఇంటికి వచ్చేసాము.

నాన్నగారి మొదటి దర్శనం అయిన కొన్ని రోజులకు నేను, నా భార్య, పిల్లలు మొదటి సారి అరుణాచలం వెళ్ళాము. P.S.N రాజు గారు, విశాఖపట్నం వాస్తవ్యులు మాకు ఆంధ్ర ఆశ్రమం లో ఉండటానికి ఒక లెటర్ ఇచ్చారు. ఈ ఆశ్రమాన్ని ఒక జంట మెయింటెన్ చేసేవారు. వచ్చిన భక్తులకు అక్కడ చూడవలసిన ప్రదేశాలు, రమణాశ్రమం, గిరిప్రదక్షిణ చూపించేవారు. అచ్చట మేము మూడు రోజులు ఉన్నాము. అన్నీ చూడటం జరిగింది. మాకు అన్నామలై స్వామి దర్శనం కూడా చేయించారు. ఇది ఒక గొప్ప అనుభూతి. తరువాతి రోజుల్లో leave travel concession (ఎల్ టి సి) ని ఎక్కువగా అరుణాచలం వెళ్ళడానికే వాడేవాళ్ళం.

అప్పటి నుండి నాన్న గారితో పరిచయం ఏర్పడింది. వారు విశాఖపట్నం వచ్చినప్పుడల్లా వారిని పర్సనల్ గా కలిసే వాడిని. అలాగే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు, దీపోత్సవం అరుణాచలంలో జరిగినప్పుడు, వారి మీటింగ్ కి వెళ్ళడం వారిని దర్శించుకోవడం జరిగింది. నన్ను ఎన్నో సందర్భాలలో చాలా బాగా గైడ్ చేసేవారు. గైడ్ చేయడం అనేదానికంటే బ్లెస్ అండ్ బ్లిస్ చేసే వారు. వారితో నాకున్న కొద్దిపాటి అనుభవాలను ఇక్కడ షేర్ చేస్తున్నాను.

ఒకసారి నాన్న గారిని పర్సనల్ గా కలవడం జరిగింది. నేను నాన్నగారిని ఎక్కువగా విశాఖపట్నంలో కోడవిల్లి పద్మ గారి ఇంటిలో కలిసే వాడిని. పద్మ గారు నాన్న గారిని కలవడానికి నన్ను ఎక్కువగా ప్రోత్సహించేవారు. వారి ఫ్యాక్టరీ ఓపెనింగ్ కి నేను నాన్నగారి సహాయకుడిగా ఉండే భాగ్యం కలిగినది. వారికి ఈ సందర్భంగా నా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. నేను నాన్న గారిని కలిసినప్పుడు ఈ విధంగా అన్నాను. నేను ఉద్యోగంలో ఇప్పటివరకు నిజాయితీగా ఉన్నాను. ఇప్పుడు నా మీద చాలా ఒత్తిడి పెరుగుతోంది. అయినా నాకు నా నిజాయితీనే కంటిన్యూ చేయాలని ఉంది. నన్ను అలా ఉండేలా బ్లెస్ చేయండి అని అడిగాను. దానికి వారు చాలా సంతోషించి నన్ను బ్లెస్ చేశారు. వారి బ్లెస్సింగ్ ఈరోజుకి నన్ను కాపాడుతూనే ఉంది.

నా భార్య నాన్న గారి దర్శనం చేసుకోవడానికి, ఉపన్యాసం వినడానికి నాకంటే చాలా ఎక్కువగా ఇష్టపడేది. అయితే నాకు నాన్నగారికి ఎక్కువ శ్రమ కలిగించకూడదని అనిపించేది. ఒకసారి నన్ను నాన్నగారి దర్శనానికి జిన్నూరు తీసుకుని వెళ్ళమని ఒత్తిడి చేసింది. నాకు కొంచెం కోపం కూడా వచ్చింది. అనాతవరం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుండి బయలుదేరి సుమారు సాయంకాలం ఆరు గంటలకు జిన్నూరు వెళ్ళాను. నాన్నగారు, మీటింగుకు బయటకు వెళ్ళి అప్పుడే వచ్చారు అన్నారు అచ్చట ఉన్నవారు. వారి వీధి తలుపు తట్టాను, ఎవరూ తీయలేదు. కొంత సమయం వెయిట్ చేసి మరలా తలుపు తట్టాను. నాన్న గారు వచ్చి తలుపు తీశారు. మీరా అని అన్నారు. లోపల వారి హాల్ లోకి రమ్మన్నారు. అక్కడ కూర్చున్నాము. నేను నాన్న గారితో ఇలా అన్నాను. నాన్నగారు, నా భార్య ఎక్కువగా మీ సమక్షాన్ని కోరుకుంటోంది. మీరు విశాఖపట్నం వచ్చినప్పుడు ఎక్కువగా మిమ్మల్ని చూడటానికి వస్తుంది. అది నాన్నగారికి ఇబ్బంది కదా, అన్ని సార్లు వెళితే అని తిట్టే వాడిని, అని నాన్న గారితో చెప్పాను. వెంటనే నాన్నగారు అబ్బే మాకు ఇబ్బంది ఏమీ ఉండదు అని అన్నారు. విష్ణు మూర్తి అలంకార ప్రియుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు దర్శన ప్రియుడు, మీరు ఎప్పుడు వచ్చినా దర్శనం చేసుకుని వెళ్ళవచ్చును అని అన్నారు. దానిని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే మనిషికి శ్రమ కానీ, దైవానికి శ్రమ ఏమిటి?

నాన్నగారు ముక్తిని పొందటానికి రెండు మార్గాల గురించి చెప్పేవారు. ఒకటి భక్తి మార్గం. రెండు జ్ఞానమార్గం. నాన్నగారితో సంభాషించే ఒక సందర్భంలో నాన్నగారు మీకు రమణ ఫిలాసఫీ సరిపోతుంది అని అన్నారు. రమణుని పుస్తకాలు చదవమనే వారు. ఆ విషయం ఓ మీటింగ్ లో కూడా ప్రస్తావించారు. పేరు చెప్పకుండా ఒక భక్తుడు నా దగ్గరకు వచ్చారు, వారికి జ్ఞానమార్గం సూట్ అవుతుందని చెప్పాను. He is fit for Gnanamargam. ఎందుకంటే analytical మైండ్ వుంది కాబట్టి. వాళ్ళు అంత తొందరగా ఏది ఆక్సెప్ట్ చెయ్యరు.

కొంతమంది భక్తుల పిల్లలు తిరువన్నామలై దగ్గర్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునే వారు. నేను అరుణాచలం వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా నాన్నగారు అరుణాచలం లో ఉన్నప్పుడు చాలా మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులను, వారి చుట్టాలను చూడడానికి వస్తూ ఉండేవారు. అప్పుడు నాకు అనిపించేది, నేను కూడా అరుణాచలం కి దగ్గరగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో టీచర్ గా పని చేస్తే రమణుడికి దగ్గరగా ఉండి నాన్నగారిని దర్శనం చేసుకోవచ్చునని. అయినా Ph.D. లేకుండా ప్రొఫెసర్ ఎలా అవుతాం? అని ఆలోచన వచ్చేది. చివరికి అరుణాచలం వెళ్ళి ఉద్యోగం చేయకపోయినా పీహెచ్ డి చేయించాడు. 2016 వ సంవత్సరంలో JNTUK, కాకినాడలో సర్టిఫికెట్ తీసుకుని నేను, నా భార్య జిన్నూరు వెళ్ళి పీహెచ్ డి సర్టిఫికెట్ నాన్నగారి పాదాలవద్ద ఉంచాము. వారి బ్లెస్ అండ్ బ్లిస్ లేకుండా అది సాధ్యం కాదు కదా. మన కోరిక కేవలం గురువుకే తెలుస్తుంది. నాన్నగారు, నేను వారిని ఎప్పుడు కలిసినా self-made-man అనేవారు. ఎవరికి పరిచయం చేసినా అలానే చెప్పేవారు. రమణుడు, నాన్నగారు వేరు వేరు కాదు. రమణుడే నాన్నగారు, నాన్నగారే రమణుడు. రూపాలు వేరు అంతే, అని నేను గట్టిగా నమ్ముతాను. నాకు కొన్ని రోజులుగా నిద్రలోకి వెళ్ళే ముందు రమణుని మెడిటేట్ చేస్తూ ( స్కంద ఆశ్రమంలో ఉండి) నిద్రలోకి జారుకోవాలి అనిపిస్తుంది. ఒకసారి రమణుడు నాకు కలలో దర్శనమిచ్చాడు. ఆయన దగదగ మెరిసే బంగారు ఛాయతో కనిపించారు. నాన్నగారు కూడా చాలాసార్లు కలలోకి వచ్చేవారు. కొన్ని మెసేజెస్ ఇస్తూ ఉండేవారు. ఎందుకో నేను వాటిని ఎప్పుడూ నోట్ చేయలేదు.

2004లో నేను నాతో పాటు జయంతి మేడం (మా పోర్టు లో ఆఫీసరు) నాన్న గారిని కలిసాము. వారు కూడా నాన్నగారి భక్తులు. నాన్నగారు ఎప్పుడు వచ్చినా తెలియజేయమని చెప్పే వారు. నాన్నగారు మా ఇద్దరిని కొన్ని ప్రశ్నలు వేశారు.

( ప్రశ్న) కృష్ణంరాజు గారు మీరు వి ఆర్ ( వాలంటరీ రిటైర్మెంట్) తీసుకుంటారా?
(జవాబు) నేను తీసుకోను నాన్నగారు. నాకు గవర్నమెంట్ సర్వీస్ అంటే చాలా ఇష్టం. అసలు అటువంటి ఆలోచనే లేదు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, నాకు పోర్టులో చీఫ్ ఇంజనీర్ అయ్యే అవకాశాలు అన్నివిధాలా ఉన్నాయి కాబట్టి.
(ప్రశ్న) ఏవండీ మీకు ఇష్టం లేదా?
(జవాబు) అవునండి ఇష్టం లేదండి.
(ప్రశ్న) జయంతి గారు, మీరు వి ఆర్ తీసుకుంటారా ?
(జవాబు) తీసుకుంటాను నాన్నగారూ, అప్లై చేస్తానన్నారు.
తర్వాత జయంతి గారు నాతో ఇలా అన్నారు. నాన్న గారు నన్ను వి ఆర్ తీసుకోమంటున్నట్టుంది. జయంతి గారితో నేను ఇలా అన్నాను. నాకైతే అస్సలు ఇష్టం లేదండీ. సుమారు 18 సంవత్సరాల సర్వీసు మానేసి ఏం చేస్తాం. చివరికి నేను 2009లో వి ఆర్ తీసుకున్నాను. తరువాత జయంతి గారు నార్మల్ రిటైర్మెంట్ అయ్యారు. అంటే నాన్నగారు నా రిటైర్మెంట్ ముందే ప్లాన్ చేశారు. అది వారు డిసైడ్ చేశారు. అలాగే నాకు చీఫ్ ఇంజనీర్ అయ్యే అవకాశం లేదు అని నాకు అర్థం అయింది. చాలామంది శ్రేయోభిలాషులు ఎందుకు వీఆర్ తీసుకున్నావు అని అడిగేవారు. వి ఆర్ తీసుకుందామని నేను ఢిల్లీ లో ఉండగా డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే విశాఖపట్నం లో ఉన్న ఒక కాలేజీ లో డైరెక్టర్ కమ్ ప్రొఫెసర్ గా పని చేయడానికి నాకు ఒక ఆఫర్ వచ్చింది. శాలరీ కూడా ఎక్కువే. కొంత మొత్తం కూడా జాబు loss కి compensation ఇచ్చారు. అదే సమయంలో నాకు డబ్బు కూడా అవసరం. మా అమ్మాయి పెళ్ళి చేయాలి. అప్పటివరకు నా సేవింగ్స్ అన్నీ నీ పిల్లల చదువులకు ఖర్చు పెట్టేసాను. అప్పుడు నేను ఆలోచించినది ఏమిటంటే నా అభివృద్ధి కంటే పిల్లల అభివృద్ధి చాలా ముఖ్యమని.

నేను కాలేజీ లో teach చేసేటప్పుడు స్టూడెంట్స్ కి మెడిటేషన్, రమణ ఫిలాసఫీ కొంచెం చెప్పడం జరిగింది. అయితే నేను పోర్ట్ నుండి వి ఆర్ తీసుకున్నాక ప్రెషర్ లెవెల్స్ చాలా చాలా తగ్గాయి. “Guru knows what you need”

2006 సంవత్సరంలో మంగళూరు పోర్ట్ లో పని చేసే వాడిని. చాలాసార్లు నాన్నగారు మంగళూరు వస్తాం అనేవారు. ఉడిపి వెళదాము అనేవారు. ఆఖరికి అది జరగలేదు. నేను మంగళూరు నుండి విశాఖపట్నం సెలవులో వచ్చాను. అప్పుడు ఒక 15 రోజులు జ్వరంతో బాధ పడ్డాను. డాక్టర్స్ కారణం కనిపెట్టలేకపోయారు. ఒక రోజున తణుకు నుండి డాక్టర్ సత్యనారాయణ రాజు గారు విశాఖపట్నం వచ్చారు. మా మేనమామ ఆయనకు చూపించారు. అది endocarditis గా తేలింది. మా పోర్టు వారు కేర్ హాస్పిటల్ కు రెఫర్ చేశారు. దానికి ట్రీట్ మెంట్ ఓన్లీ బెడ్ రెస్ట్ అండ్ డైలీ టు ఇంజక్షన్స్ ఫర్ 40 డేస్. Care hospital లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇంజక్షన్ ఇచ్చిన వెంటనే నాకు ప్రాణం పోయినట్టు అనిపించింది. వెంటనే డాక్టర్ అని అరిచాను. నాకు అదే ఆఖరి శ్వాస అనుకున్నాను. వెంటనే ఒకటి గుర్తు వచ్చింది. మనం లాస్ట్ శ్వాస వదిలే ముందు ఏ తలంపుతో ఉంటామో దాని ప్రకారమే మనకు రిజల్ట్స్ ఉంటాయని. వెంటనే రమణుని మెడిటేట్ చేశాను. కాసేపటికి మామూలుగా అయ్యాను. వేరే ఇంజక్షన్ కూడా ఇచ్చారని చెప్పారు. అయితే కేక వేసిన తర్వాత భయం మాత్రం వేయలేదు. తరువాత పోర్ట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. అక్కడి కిటికీలోంచి కైలాస హిల్స్ కనిపించేవి. అదే అరుణాచలం గా భావించి తృప్తి చెందాను. తర్వాత నెల రోజులకు డిశ్చార్జ్ అయ్యాను. “GURU WILL KEEP UP YOUR HEALTH IN CASE YOUR PRESENCE IS STILL NEEDED”

2008-09 లలో నేను ఢిల్లీలో వర్క్ చేసే వాడిని. మా అమ్మాయికి పెళ్ళి కుదిరి క్యాన్సిల్ అయినది. అప్పుడు నేను చాలా స్ట్రెస్ కి గురి అయ్యాను. నేను, నా భార్య ఢిల్లీ నుండి బయలుదేరి డైరెక్ట్ గా నాన్నగారు దర్శనానికి అరుణాచలం వచ్చాం. నాన్న గారికి పెళ్ళివిషయం వివరించడం జరిగింది. అలా జరగడం మంచిదే అని అన్నారు. అప్పుడు ధైర్యం వచ్చింది. తర్వాత మా అమ్మాయి పెళ్ళి కుదిరింది. మొదటి శుభలేఖ నాన్న గారికి ఇవ్వడం జరిగింది. నాన్నగారికి ఆ విషయం చెప్పిన మొదలు నేను ఎప్పుడు కలిసినా మీ అమ్మాయి హేపీగానే ఉందా?అని అడిగే వారు. నాకు ఇద్దరు మనుమలు కలిగిన తరువాత కూడా అదే విషయాన్ని అడిగేవారు. మన గురించి ఇంత కేర్ తీసుకునే వారు గురువు మాత్రమే. తల్లిదండ్రులు కూడా తీసుకోరు అని అనిపిస్తుంది. “A CONTINUOUS CARE CAN BE TAKEN ONLY BY GURU. GOD WILL TAKE CARE OF YOU INCIDENTALLY”

నాన్నగారు అనారోగ్యానికి గురైన తరువాత విశాఖపట్నం నుండి జిన్నూరు తీసుకుని వెళ్ళేముందు భక్తులందరికీ P S N Raju గారి అబ్బాయి మురళి గారి ఇంట్లో దర్శనం ఇచ్చారు. నాన్నగారు బెడ్ మీదే ఉన్నారు. అందరితోపాటు నేను కూడా వారిని దర్శనం చేసుకోవటానికి వెళ్ళాను. అయితే వారు నన్ను గుర్తించి కనుబొమలు పైకి లేపి చూసి మీరా అన్నట్టు చూశారు. అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటన. అదే వారిని చివరిగా దర్శించడం. గురువు కేవలం ఫిజికల్ బాడీ కాదు. కాబట్టి వారు మనకు సమయం వచ్చినప్పుడు వారిలో ఐక్యం చేసుకుంటారు. “GURU WILL EXPECT NOTHING, BUT GIVES US EVERYTHING”

No comments:

Post a Comment