Sunday, June 6, 2021

ఎప్పుడూ శాంతిని కోల్పొవద్దు

ఒక భక్తురాలు తన పిల్లల ప్రవర్తన విషయంలో, ఎన్ని సార్లు ఎన్ని విధాలుగా నచ్చచెబుతున్నా వాళ్ళలో మార్పు రావటంలేదని ఆందోళన చెందుతున్నారు. ఆమె ఒకరోజు నాన్నగారి దగ్గర మిగిలిన భక్తులతో కలిసి కూర్చున్నారు.

అప్పుడు నాన్నగారు ఆమె వైపు చూస్తూ, "భగవాను, రామకృష్ణుడు కొన్ని కొన్ని సందర్భాలలో భక్తుల ప్రవర్తన సరిగా లేకపోతే, వాళ్ళ శ్రేయస్సు కోరి కొద్దిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసేవారు. అయితే బుద్ధుడు మాత్రం ఎప్పుడూ శాంతిని కోల్పోలేదు. ఆ విషయం చెప్పి ఊరుకునేవాడు" అని చెప్పారు. అంటే, చెయ్యవలసింది చేస్తూ ఆందోళన పడకుండా, శాంతిగా ఉండమని ఆమెకు పరోక్షంగా తెలియజేసారు.

No comments:

Post a Comment