Sunday, April 18, 2021

మన నిజ స్వరూపానికి మరణం లేదు

మనం ఎప్పుడైనా ఎవరికైనా నమస్కారం చేసినప్పుడు, వారిలో అంతర్యామిగా ఉన్న ఈశ్వరుడికి చేస్తాము. అలాగే ఒక జ్ఞానికి నమస్కారం చేసినప్పుడు అది సూటిగా ఈశ్వరునికే అందుతుంది. ఎందుకంటే అక్కడ వ్యక్తి లేడు, ఈశ్వరుడే తానై ఉన్నాడు. కాబట్టి, జ్ఞాని అడగకుండానే గౌరవించబడతాడు. అహంకారం ఉన్నవాడు అడిగినా గౌరవాన్ని పొందలేడు.


భగవాన్ బోధకి నాన్నగారు, భక్తులకి సులభంగా అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న ఉదాహరణలతో వివరణ ఇచ్చేవారు.

పాండవులలో శ్రేష్టుడైన ధర్మరాజు (యుధిష్టిరుడు) ని యక్షుడు ప్రపంచంలో కెల్లా ఏది ఎక్కువ ఆశ్చర్యకరమైనది? అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు లోకంలో ఎంతో మంది మరణించడం చూస్తూ ఉన్నా కూడా, మనకు మరణం వస్తుందని ఎవరూ గుర్తించకపోవడం ఆశ్చర్యకరం అన్నాడు.

దీనికి భగవాన్, నీ నిజస్వరూపానికి చావులేదు. కనుక మనం చనిపోము అనుకోవడంలో ఆశ్చర్యంలేదు, అది సహజం అన్నారు.

No comments:

Post a Comment