Sunday, May 23, 2021

మనసుని శుద్ధి చేసుకోవడం అవసరం

బ్రెజిల్ దేశం నుంచి వచ్చిన ఒక భక్తుడు ( స్వామి ) నాన్నగారిని, మనసు మనం కాదంటున్నారు కదా! మరి దానిని పవిత్రం చేసుకోవడం ఎందుకు? అని అడిగారు.

అప్పుడు నాన్నగారు శరీరం నేను కాదని ఆంటున్నాము కదా! మరి దానిని శుభ్రం చేసుకుంటున్నాము కదా! అందుచేత, మనసు మనం కాకపోయినా మనసుతో తాదాత్మ్యం పొందుతున్నాం కాబట్టి, దానిని పవిత్రం చేసుకోవాలి. లేకపోతే మన ఆత్మసాక్షాత్కారానికి అదే అడ్డు పడుతుంది అన్నారు.



ఒక భక్తురాలు నాన్నగారితో, నాకు ఇప్పటివరకూ భక్తిలేదు. నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు, చెడ్డ అలవాట్లు ఉన్నాయి. మిమ్మల్ని చూసి, అరుణాచలాన్ని చూసాకా నాకు భక్తిగా జీవించాలని అనిపిస్తోంది. అయితే అరుణాచలం నుంచి ఇంటికి తిరిగి వెళ్ళాకా మళ్ళీ నా స్నేహితులు, పాత అలవాట్లవైపు వెళ్ళిపోతానేమో అని భయంగా ఉంది అన్నారు.

అప్పుడు నాన్నగారు నీ మనస్సు అంత బలహీనమా? నీ మనస్సు బలమైనది అయితే వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. నీ మనస్సు బలహీనమైనది అయితే నువ్వే వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతావు. ఒక వివేకం ఉన్న వ్యక్తి తనకు ఏది మంచిదో దానిని ఎంచుకుంటాడు. నీకు వివేకం గనుక ఉంటే నువ్వు చెడు మార్గం వైపు ప్రయాణం చేయవు అన్నారు.

No comments:

Post a Comment