Sunday, May 2, 2021

అనుగ్రహంగా మారిన సమర్పణలు

ఒకసారి నాన్నగారి దగ్గర భక్తులంతా చేరి పండ్లు, స్వీట్లు సమర్పిస్తున్నారు. అప్పుడు నాన్నగారు ఒక భక్తురాలిని వీటిని ఏమంటారమ్మా? అని అడిగారు. ఆ భక్తురాలు ఏంమాట్లాడలేదు. అప్పుడు నాన్నగారు ఆఫరింగ్స్ అంటారు అని చెప్పి వాటిని చేతుల్లో పట్టుకుని కళ్ళు మూసుకొని, తరువాత కళ్ళు తెరిచి ఆమెకి తిరిగి ఇస్తూ దీనిని ప్రసాదం అంటారు అని చెప్పారు.

అలాగే మన కర్తృత్వాన్ని గనక ఆయనకి బహుమతిగా ఇస్తే, ఆయన మనల్ని పవిత్రం చేసి అనుగ్రహించి మన లోపల ఉన్న వస్తువుని మనం పొందేలా చేస్తారు.

No comments:

Post a Comment