Sunday, February 21, 2021

అన్నం పరబ్రహ్మ స్వరూపం

ఒకసారి హోటల్లో నాన్నగారు, డా. ఉషగారు కలిసి కూర్చుని భోజనం చేసినప్పుడు, విస్తరిలో ఎక్కువ ఆహార పదార్థాలు వడ్డించడం జరిగింది. ఆమె తినలేక అవస్థ పడుతుంటే నాన్నగారు, ఏమ్మా ఎక్కువయిందా? తినలేకపోతున్నావా? అని అడిగారు. అవును నాన్నగారూ అంటే, "అన్నం పరబ్రహ్మ స్వరూపం" అమ్మా! ముందే తక్కువ వడ్డించమని చెప్పాలి, అవసరమైతే మళ్ళీ పెట్టించుకోవాలి. అంతే కానీ, పెట్టిన తరువాత వృధా చేయకూడదు అన్నారు. చాలా ఆప్యాయంగా, ఎంతో ప్రేమగా చెప్పడం వల్ల తినడం కష్టమైనా కూడా మొత్తం తినడం జరిగింది.

ఆ సంఘటన తరువాత జీవితంలో ఎప్పుడూ ఆహార పదార్థాలు వృధా చేయలేదని ఆమె తన అనుభవంగా తెలియజేసారు. నాన్నగారు ఆధ్యాత్మిక విషయాలు బోధించడంతో పాటు, నిత్యజీవితంలో మన అలవాట్లు, నడవడిక ఎలా ఉండాలో కూడా సందర్భాన్ని బట్టి ప్రేమతో వివరించి సరిచేస్తూనే ఉండేవారు.

No comments:

Post a Comment