Sunday, March 21, 2021

ప్రతిఫలాపేక్ష లేకుండా పనిచేయాలి

నాన్నగారిని ఒక భక్తుడు, మీరు మౌనమే బంగారం అంటారు కదా! ఆ స్థితికి మేము ఎప్పుడు చేరతాము? ఆ బంగారం ఎప్పుడు మా సొంతమవుతుంది? అని అడిగారు.

ఆ ప్రశ్న వినగానే నాన్నగారు కాసేపు మౌనంలోకి వెళ్ళారు. తరువాత, ఆత్మ విద్యని సొంతం చేసుకోవడానికి అంత సులభంగా అర్హత వచ్చేయదు. ఆ అర్హత మనం పొందాలి అంటే, జ్ఞానసముపార్జన చేసి దానిని అర్థంచేసుకునే స్థాయికి మనం ఎదగాలి అంటే, నువ్వు ప్రతిఫలం ఆశించకుండా భక్తి, శ్రద్ధలతో పనిచేయడం అలవరుచుకోవాలి. అంటే, కర్తలేని కర్మ చేయాలి. ఈ ప్రక్రియ అంతా గురువు అనుగ్రహం లేకుండా జరగదు. అనుగ్రహం వల్లనే ఆయన జ్ఞానబోధ అర్థం అవుతుంది. అప్పుడు క్రమంగా మౌనం అనుభవంలోకి వస్తుంది అన్నారు.

No comments:

Post a Comment