Sunday, March 7, 2021

గురువు హృదయంలో భక్తుల మధ్య బేధం లేదు!

బుజ్జి అనే ఒక భక్తుడు ( సేవకుడు ) నిరంతరం నాన్నగారి దగ్గర ఉండి ఆయన పనులన్నీ చేసేవాడు. నాన్నగారి ప్రవచనాలను రికార్డ్ చేసి కేసెట్లుగా తయారు చేయించేవాడు. అతను ఒకసారి నాన్నగారిని "అందరు భక్తులూ గురువు గారికి సమానం ఎలా అవుతారు?" అని అడిగాడు.

అప్పుడు నాన్నగారు, “బాహ్యంగా చూడటానికి వేరు వేరుగా అనిపించవచ్చు. కానీ, గురువు హృదయంలో మాత్రం అందరు భక్తులూ సమానమే!" అన్నారు. అది విన్న వెంటనే ఆయన చుట్టూ ఉన్న భక్తులంతా ఆనందంతో చప్పట్లు కొట్టారు.

No comments:

Post a Comment